మూడు సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడు.. సూపర్ కార్

సూపర్ కార్ల తయారీ సంస్థ లంబొర్ఘిని ఇండియా మార్కెట్లో తుఫాను స్రుష్టించబోతుంది. మూడు సెకన్లలో 100 కిలోమీటర్ల స్పీడు అందుకునే సరికొత్త కారు ఆవిష్కరిస్తుంది. భారతీయ యువత కలల కారుగా ఉన్న ఈ సూపర్ కారు విభాగంలో సరికొత్త ఈవీ తీసుకొస్తోంది. హరికేన్ ఈవో పేరుతో ఇది వస్తోంది. ముంబయిలోకొత్త షోరూమ్ ఓపెన్ కూడా చేస్తున్న ఈ కంపెనీ… సరికొత్త కారుతో దూసుకొస్తోంది. అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దిన ఈ కారులో ఫీచర్స్ చూస్తే మతిపోతుంది. 50 కిలోమీటర్ల వేగంతో పోతున్న కారు రూఫ్ ను కూడా 17 సెకన్లలో క్లోజ్ చేయవచ్చు. దీని రూపం కూడా మార్చారు. మరింత ఎయిరో డైనమిక్ రూపం ఇచ్చారు. 8.4 ఇంచ్ టచ్ స్క్రీన్, యాపిల్ కార్ ప్లే, వాయిస్ కమాండ్ ఉంది. డ్యూయల్ కెమెరా టెలిమెట్రీ, హార్డ్ డిస్క్ ఉంటాయి. ప్రతిదీ ఇందులో డేటా ఉంటుంది. ఇంజిన్ సామర్ధ్యం కూడా భారీగానే ఉంది. 5.2 లీటర్ ఇంజిన్… అంటే 5200 సీసీ. వీ10 పవర్ కూపే వెర్షన్ ఇది. 8000 RPM వద్ద 631Bhp పవర్ ను, 6500 RPM వద్ద 600Nm టార్క్ ను విడుదల చేస్తుంది. రోడ్డుపై రయ్యన దూసుకెళ్లే ఈ కారు అంత ఈజీగా అమ్మకానికి లేదంటోంది కంపెనీ.. ముందుగా బుక్ చేసుకున్నవారికి వారి అవసరాల తగ్టట్టెు కొన్ని మార్పులు చేసి ఇస్తారు. ధర కూడా భారీగానే ఉందంటున్నారు. 5 కోట్లకు పైమాటే.

Recommended For You