మినిస్ట‌ర్‌గా మిస్‌వ‌రల్డ్‌!

మినిస్టర్ అవుతారా?

ఐశ్వర్య రాయ్.. త‌న‌దైన అందాల‌తో.. న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న సుంద‌రి భ‌విష్య‌త్తులో మంత్రి కాబోతున్నారా? ఇప్ప‌టివ‌ర‌కూ సినిమాల్లో మాత్ర‌మే పాత్ర‌లు పోషించిన హీరోయిన్ ఇప్పుడు నిజ‌మైన నాయ‌కురాలి పాత్రలోకి మార‌బోతున్నారు. మిస్ వ‌రల్డ్‌గా.. హీరోయిన్‌గా క్రేజ్‌ను, ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు ఐశ్వ‌ర్య‌రాయ్. ఇప్పుడు అమితాబ్ కుటుంబంలో కోడ‌లిగా.. ఆరాధ్య త‌ల్లిగా క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నారు. కొత్త‌గా రాజ‌కీయ నాయ‌కురాలిగా మార‌తానంటున్నారు. మ‌న‌సులో మాట నేరుగా బ‌య‌ట‌పెట్ట‌క‌పోయినా.. ఓ ఇంట‌ర్వ్యూలో ఏమో? గుర్రం ఎగ‌రావ‌చ్చు అంటూ ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చారు. వ‌చ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్ లో జ‌రిగే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే ప్ర‌శ్న అడిగితే స‌మాధానం దాట‌వేశారు. పైగా మోడీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. దేశం కోసం మోడీ తెగ క‌ష్ట‌ప‌డుతున్నార‌ని అంద‌రూ ఆయ‌న అడుగుజాడ‌ల్లో న‌డవాలంటూ సెల‌విచ్చారు. అంటే రాజ‌కీయాల్లో ఆమె లైన్ క్లియ‌ర్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. యూపీ ఎన్నిక‌ల్లో ఆమెను రంగంలో దింపాల‌ని బీజేపీ భావిస్తోంది. ఆమెతో ప్ర‌చారం చేయించ‌డం ద్వారా పార్టీకి మాస్‌లో ఇమేజ్ పెంచాల‌నుకుంటోంది. ఆమె కూడా సిద్దంగా ఉన్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌వేళ పోటీ చేసి గెలిస్తే మాత్రం ఆమె ముఖ్య‌మంత్రి కాదు గానీ మంత్రి గ్యారెంటీ అంటున్నారు. ఒక‌వేళ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నంటే ప్ర‌చారానికి సేవ‌లు వాడుకుని అనంత‌రం రాజ్య‌స‌భకు పంపే అవ‌కాశం ఉందంటున్నారు.
అయితే రాజ‌కీయాల్లోకి వ‌స్తానంటే అమితాబ్ ఊరుకుంటారా అన్న‌ది అనుమాన‌మే? అంటున్నాయి ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు. గ‌తంలో రాజీవ్‌గాంధీకి అత్యంత స‌న్నిహితుడిగా ఉన్న అమితాబ్ ఎంపీగా కూడా ప‌నిచేశారు. రాజీవ్ మ‌ర‌ణం త‌ర్వాత గాంధీల కుటుంబానికి క్రమంగా దూర‌మ‌య్యారు. అదే స‌మ‌యంలో ములాయం సింగ్ యూద‌వ్‌కు అమితాబ్ ద‌గ్గ‌ర‌య్యారు. అంతే కాదు.. ఆయ‌న భార్య న‌టి జ‌యాబాధురికి ములాయం రాజ్య‌స‌భ క‌ట్ట‌బెట్టారు. త‌ర్వాత గుజ‌రాత్ అంబాసిడార్‌గా వ్య‌వ‌వ‌హ‌రించిన మోడీకి ద‌గ్గ‌ర‌య్యారు. ప్ర‌ధాని అయిన త‌ర్వాత కూడా మోడీతో అమితాబ్ స‌న్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. రాజ‌కీయాలకు దూరంగా ఉంటున్న అమితాబ్ వ్య‌క్తిగ‌తంగా ప‌లు పార్టీల నాయ‌కుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉంటున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఐశ్వ‌ర్య రాయ్ ఓ పార్టీ త‌రపున ప్ర‌చారం చేస్తే ఇత‌ర నాయ‌కుల‌కు త‌ప్పుడు సంకేతాలు పోయే ప్ర‌మాదం ఉంది. అందుకే ఐశ్వ‌ర్య ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు మామ అమితాబ్ బ్రేకులు వేసే అవ‌కాశం ఉందంటుున్నారు. అయితే రాజ్య‌స‌భ‌కు మాత్రం అడ్డు చెప్ప‌క‌పోవ‌చ్చు. ఐశ్వ‌ర్య రాజ్య‌స‌భ‌కు వెళితే అరుదైన ఘ‌న‌త సాధించిన కుటుంబంగా మిగులుతుంది. ఇప్ప‌టికే ఈ కుటుంబంలో ముగ్గురు ప‌ద్మాలు ఉన్నారు. జ‌య‌బాధురి, ఐశ్వ‌ర్య‌కు ప‌ద్మ‌శ్రీలు పురస్కారాలు వచ్చాయి. అమితాబ్ ప‌ద్మ‌విభూష‌ణ్‌ అందుకున్నారు. ఇక ఇప్ప‌టికే అమితాబ్ దంపతులు ఎంపీలుగా పనిచేశారు. ఐశ్వ‌ర్య కూడా రాజ్య‌స‌భ‌కు వ‌స్తే ముచ్చ‌ట‌గా మ‌గ్గురు అవుతారు. ఇలా సెలిబ్రిటీల ఫ్యామిలీలో ఎన్ని అవ‌కాశాలో క‌దా?

Recommended For You

Comments are closed.