మళ్లీ రిపీట్ అవుద్దీ…!


అసలు విషయం మరిచి…!

సర్దార్ బైబైై!

తెలుగు సినిమా పరిశ్రమకు సర్దార్ మరో సందేశం ఇచ్చిందా? సినిమాలు వ‌న్ మ్యాన్ షో చేయాల‌నుకుంటే ప్రేక్ష‌కులు తిర‌స్క‌రిస్తార‌ని తేల్చేసిందా? ఎంత దూకుడుగా సినిమా వచ్చిందో అంత స్పీడుగా థియేటర్ల నుంచి వెళతానంటోంది. ఇది  పాఠంగా భావించాలా? అవునంటున్నారు ఇండ‌స్ట్రీ విశ్లేష‌కులు. ఇటీవ‌ల కాలంలో చాలా సినిమాలు వ‌చ్చాయి. హిట్ సాదించిన సినిమాల‌న్నీ ప‌క్కా క‌థ‌, క‌థ‌నంతో సాగాయి. శ్రీ‌మంతుడు, భ‌లేభ‌లేమొగాడివోయ్‌, క్ష‌ణం, ఊపిరి వంటి సినిమాలు మంచి హిట్ కొట్టాయి. రికార్డు క‌లెక్ష‌న్లు కొల్ల‌గొట్టాయి. నిన్న బ్రూస్‌లీ, నేడు స‌ర్దార్ ఆక‌ట్టుకోలేక‌పోయాయి. మ‌రికొన్ని యాక్ష‌న్ సినిమాలు అస‌లే చూడ‌లేక‌పోయారు. ఇందుకు కార‌ణంగా క‌థ క‌న్నా డైలాగులు, హీరోయిజం చూపించ‌డం వ‌ల్లే అని అర్ధ‌మ‌వుతోంది. క‌థ ఉంటే హీరోయిజాన్ని ఎంత చూపించినా ప్ల‌స్ అవుతుంది. క‌థ లేకపోతే అదే మైన‌స్ అవుతుంది. ఈ చిన్న‌లాజిక్ మిస్ చేసి సినిమాలు తీస్తున్నారు. బాక్సాఫీసు వ‌ద్ద బుక్ అవుతున్నారు. శ్రీ‌మంతుడు మంచి సందేశంతో వ‌చ్చింది. ఊపిరి క‌థ‌ను న‌మ్ముకుంది. క్ష‌ణం కొత్త‌ద‌నాన్ని ప‌రిచ‌యం చేసింది. భ‌లేభ‌లే మొగాడివోయ్ హీరో క్యారెక్ట‌ర్‌ను హృద్యంగా తీర్చిదిద్దారు. స‌ర్దార్‌లో ఏం లేకుండా అంతా ప‌వ‌న్‌నే న‌మ్ముకున్నారు. మిగ‌తా పాత్ర‌ల‌కు ప్రాధాన్య‌త లేకుండా చేశారు. కేవ‌లం పాట‌లు, ఆట‌లు, ఫైట్స్ చాలనుకున్నారు. ఫ‌లితం తేలిపోయింది. ఇక‌నైనా సినిమాకు కథే ప్రామాణిక‌మ‌ని న‌మ్మితే బాగుంటుంది. లేదంటే మ‌ళ్లీ మ‌ళ్లీ అదే రిపీట్ అవుద్ది.

Recommended For You

Comments are closed.