ప‌న్నీరు చెవిలో ‘‘క‌మ‌లం‘‘ పువ్వు

ఎవ‌రో జ్వాల‌ను ర‌గిలించారు..
మ‌రెవ‌రో దానికి బ‌ల‌య్యారు…
ఈ సినిమా పాట‌లోని ఈ రెండు వాఖ్యాలు త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్‌ సెల్వానికి స‌రిగ్గా స‌రిపోతుంది. ఆయ‌న చేసిన చారిత్ర‌క త‌ప్పిదం రాజ‌కీయ భ‌విష్య‌త్తునే అయోమ‌యం చేసింది. ప‌న్నీర్ సెల్వం ఎపిసోడ్‌లో సీన్ల‌న్నీ ఆయ‌న రాసుకున్న‌వి కాదు.. ఎవ‌రో ఇచ్చిన స్క్రిప్టును ఆయ‌న ఫాలో అయ్యారు. కానీ క్లైమాక్స్ ఊహించ‌లేక‌పోయారు. అంతా శ‌శిక‌ళ సిఎం కావొద్ద‌నుకున్నారు కానీ.. ప‌న్నీరుకే ప‌ట్టం క‌ట్టాల‌ని అందులో రాసిన‌ట్టు లేరు. అందుకే ప‌ళ‌నిసామి సిఎం అయ్యారు. ప‌న్నీరుకు క‌న్నీళ్లే మిగిలాయి.

వాస్త‌వానికి శశిక‌ళ సిఎం కావ‌డం ఇష్టం లేని కేంద్రంలోని పెద్ద‌లు ఆమెను సైడ్ చేయాలని ప‌క్క‌గా స్కెచ్ వేశారు. జ‌య‌ల‌లిత మ‌ర‌ణం నుంచి ప‌ళ‌నిసామి సిఎం దాకా అంతా జాగ్రత్తగా న‌డిపించారు. జ‌య మ‌ర‌ణించిన రాత్రే శ‌శిక‌ళ‌కు చెక్ పెట్ట‌డానికి వ్యూహం మొద‌లుపెట్టారు. స‌మ‌యం కూడా ఇవ్వ‌కుండా అర్ధ‌రాత్రి ప‌న్నీర్ చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. కేంద్ర మంత్రులు ద‌గ్గ‌రుండి న‌డిపించారు. ఆల‌స్యంగా గుర్తించిన శ‌శిక‌ళ పార్టీపై ప‌ట్టు చేజారి పోతుంద‌ని భావించి ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌దవి తీసుకున్నారు. సిఎం కూడా కావాల‌నుకున్నారు. శశికళ ఇంత త్వరగా పదవి కోసం పట్టుబడతారని కేంద్రంలోని పెద్దలు ఊహించ‌లేదు. పన్నీర్ కొన‌సాగుతార‌ని భావించారు. సరిగ్గా ఇదే సమయంలో కోర్టు తీర్పు క‌లిసొచ్చింది. ిదే అదనుగా ప‌న్నీర్ చేత తిరుగుబాటు చేయించారు. పన్నీర్ ను ముందుకు తోశారు కానీ.. ఆత‌ర్వాత ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డంలో విఫ‌ల‌మ‌య్యారు. న‌మ్మిన‌బంటుకు సొంత తెలివితేట‌లు లేవు. పైగా మ‌న్నార్‌గుడి మాఫియా గుప్పిట్లో ఎమ్మెల్యేలున్నారు. అంతే శశిక‌ళ కోర్టు తీర్పు రావ‌డంతోనే ప‌ళ‌నిసామిని ప్రత్యర్ధులకు చెక్ పెడుతూ రంగంలో దింపారు. దీంతో పన్నీరును కాపాడే శ‌క్తి కేంద్రానికి కూడా లేక‌పోయింది. ఎమ్మెల్యేలు అంతా ప‌ళ‌నికే మొగ్గు చూపారు. దీంతో ప్ర‌భుత్వం కొలువుదీరింది. మొత్తానికి ప‌న్నీరు చేవిలో క‌మ‌లం భాగానే పెట్టారు. పన్నీర్ సెల్వం చిన్నమ్మపై తిరుగుబాటు చేయ‌కుండా శశిక‌ళ‌కు సిఎం ప‌ద‌వి అప్ప‌గించి ఉంటే… కోర్టు తీర్పు రాగానే మ‌ళ్లీ తాత్కాలిక సిఎం హోదా ద‌క్కేది. ఒక‌ప్పుడు అమ్మ‌కు దండాలు పెట్టాడు.. ఇప్పుడు చిన్న‌మ్మ‌కు పెట్టాల్సి వచ్ఉంచేది. పెద్ద తేడా లేదు. కానీ ఎవ‌రో చెప్పార‌ని త‌ప్పుట‌డుగు వేస్తే ఇలాగే ఉంటుంది.. అయ్యో ప‌న్నీర్ అన‌డం త‌ప్ప ఏమీ మిగ‌ల్లేదు.

Recommended For You

Leave a Reply

Your email address will not be published.