పైసా ఖర్చు లేకుండా కొత్త మారుతీ కార్లు

కారు కొనడం చాలామందికి సమస్య కాదు.. కానీ నిర్వహణే పెద్ద సవాలు.. ఇన్సూరెన్స్… సర్వీస్… ఇలా అదనపు ఖర్చులు భారీగానే ఉంటాయి. అందుకే చాలామంది వాటిని చూసి భయపడి.. కొనడానికి వెనకడుగు వేస్తుంటారు. అయితే ఇందుకోసమే మార్కెట్లో మంచి ఆఫర్ ఉంది… అదే లీజింగ్ పద్దతి.

FOR VIDEO CLICK LINK

కారు కొననవసరం లేదు. నెలనెలా అద్దె ఇస్తే చాలు.. కారు మీ సొంతం అవుతుంది. ఎన్ని నెలలు వాడుకుంటే అన్ని నెలలు మీరు అద్దె చెల్లిస్తే చాలు…
ఇందులో మరో బెన్ ఫిట్ కూడా ఉంది… ఒకే కారు వాడాలని లేదు.. మీకు నచ్చిన కారు అద్దెకు తీసుకోవచ్చు. నెలకో కారులో షికారు చేయవచ్చు. అయితే కారును బట్టి అద్దె మారుతుంది. ఏమైనా ఇది కస్టమర్లకు మంచి ఆప్షన్. అదనపు నిర్వహణా భారం లేకుండా పెట్రోల్ కొట్టించుకుని హ్యాపీ డ్రైవ్ చేయవచ్చు.
చాలా కంపెనీలు దీనిని అమలు చేస్తున్నాయి. ఇప్పుడు ఇండియాలో అత్యధికంగా అమ్ముడయ్యే మారుతీ కంపెనీ కూడా లీజింగ్ పై ద్రుష్టి పెట్టింది.
కార్ల అమ్మకాలు తగ్గి నష్టాల్లో ఉన్న కంపెనీలు… సేల్స్ పెంచుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రిటైల్ కస్టమర్ల కోసం అతిపెద్ద కంపెనీ మారుతీ కార్లు లీజుకు ఇచ్చేందుకు సిద్దమవుతోంది.
ఇప్పటికే హుండాయ్, మహీంద్రా కంపెనీలు కార్ల లీజ్ పద్దతి అనుసరిస్తున్నాయి. ఇప్పుడు మారుతీ కూడా ఇదే బాటలో నడుస్తోంది. ఇది కంపెనీ సేల్స్ కు సంబంధం లేకపోయినా.. అదనపు ఆదాయవనరుగా మారుతుంది. ఇది కస్టమర్లకు కూడా కొంత బెన్ఫిట్ ఉంటుంది.
చాలా కంపెనీలు మార్కెట్లో ఉన్న స్టార్టప్ అయిన జూమ్; రేవ్ వంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకుని.. లీజుకు ఇస్తుంటాయి. కానీ BMW, బెంజ్ పెద్ద కంపెనీలు నేరుగానే తమ కస్టమర్లకు అద్దెకు ఇస్తున్నాయి. అమెరికా సహా చాలా దేశాల్లో ఈ విధానం ఎక్కువగా ఉంది.
కస్టమర్లు కారు కొనకుండా లీజుకు తీసుకోవడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. నిర్వహణ భారం ఉండదు. వాడుకున్న నెలకు మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
2018లోనే మహీంద్రాలోనే లీజ్ విధానం మొదలుపెట్టింది. అయితే జూమ్ సంస్థ ద్వారా సేవలు అందిస్తుంది. హుండాయ్ కూడా గత ఏడాది దీనిని బెంగుళూరు సహా పలు నగరాల్లో లీజింగ్ కు ఇస్తోంది.

Recommended For You