పెళ్లి బంధంతో ఒక్కటైనా ఇద్దరు మహిళా క్రికెటర్లు

ఇద్ద‌రు మ‌హిళా క్రికెట్లు పెళ్లి చేసుకున్నారు.. అయితే వేర్వేరు వ్య‌క్తుల‌ను మాత్రం కాదు.. వారిద్ద‌రే వివాహం చేసుకున్నారు. అయితే భార‌త‌దేశంలో మాత్రం కాదులేండి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా క్రికెట‌ర్లు వీరు. ఆదేశాల త‌ర‌పున ఆడుతున్న హేలీ జెన్సెస్ అనే క్రీఢాకారిణి నికోలా హ‌న్ కాక్ ను వివాహం చేసుకుంది. వీర‌ద్ద‌రూ పెళ్లి చేసుకున్న ఫోటోల‌ను ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. న్యూజిలాండ్ లో స్వ‌లింగ సంప‌ర్కం. స్వ‌లింగ వివాహాలు చ‌ట్ట‌బ‌ద్దం చేయ‌డంతో ఈ వివాహం చేసుకున్నారు. 2013 నుంచి స్వలింగ సంపర్క వివాహాలు న్యూజిలాండ్‌లో లీగ‌ల్ చేశారు. గతేడాది దక్షిణాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ డేన్ వ్యాన్ నీకెర్క్ కూడా తన సహచరి అయిన మారిజానే కేప్‌ను వివాహం చేసుకుంది. అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడుగున్న మ‌హిళ‌లు స్వ‌లింగ వివాహాలు క్ర‌మంగా పెరుగుతున్నాయి.

Recommended For You