పాలిటిక్స్


రాజ‌కీయాల్లో మ‌రో వార‌సుడు

రాష్ట్ర రాజ‌కీయాల్లో మ‌రో వార‌సుడు అడుగు పెడుతున్నాడా? అవున‌నే స‌మాధానం వ‌స్తోంది పార్టీ వ‌ర్గాల నుంచి.

తుమ్మల యుగంధర్

మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కుమారుడు యుగంధ‌ర్ రాజ‌కీయ తెరంగ్రేట్రం చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇటీవల అనారోగ్యంతో పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంక‌ట‌రెడ్డి మృతి చెందారు. అక్క‌డ ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఉప ఎన్నిక‌లో పోటీ చేసేందుకు తుమ్మ‌ల త‌న‌యుడు యుగంధ‌ర్ ఆస‌క్తి చూపిస్తున్నారు. సీటు కోసం పార్టీలో గ‌ట్టి పోటీనే ఉంది. మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వ‌ర‌రావు, ప్ర‌స్తుత డీసీసీబి అధ్య‌క్షుడు మువ్వా విజ‌య్ బాబు రేసులో ఉన్నారు. అయితే ఇక్క‌డ నుంచి తానే పోటీ చేస్తాన‌ని యుగంధ‌ర్ త‌న స‌న్నిహితుల చెబుతున్నార‌ట‌. తండ్రి వ‌ద్ద కూడా ప్ర‌స్తావించిన‌ట్టు స‌మాచారం. కానీ తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు మాత్రం వ‌ద్ద‌ని చెబుతునట్టు తెలుస్తోంది. వ్యాపారాలు చేసుకోమ‌ని సూచిస్తున్నార‌ట‌. రాజ‌కీయాల్లోకి వ‌స్తే జీవితంలో చాలా న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంద‌ని గ‌తంలో ప‌లుమార్లు చెప్పిన తుమ్మ‌ల… వార‌సుడికి కూడా అదే చెప్పార‌ట‌. కానీ యుగంధ‌ర్ మాత్రం పోటీ చేస్తాన‌ని ప‌ట్టుబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది.
పాలేరులో మువ్వా విజ‌య్‌బాబు చేత పోటీ చేయించాల‌ని తుమ్మ‌ల భావిస్తున్నారు. పోట్ల నాగేశ్వ‌ర్‌రావు ఇటీవ‌లే పార్టీలో చేరారు. ఆయ‌న కూడా సీటు ఆశిస్తున్నారు. కానీ తుమ్మ‌ల ఆయ‌న ప‌ట్ల ఆస‌క్తి చూప‌డం లేదు. దీంతో ఆక్క‌డ తుమ్మ‌ల వార‌సుడు, లేదా విజ‌య్‌బాబుల్లో ఒక‌రు పోటీ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. 

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లాలో త‌న‌కంటూ ప్ర‌త్యేక ముద్ర‌ను.. మార్కును చూపిస్తున్న నాయ‌కుడు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు.  టీడీపీలో ఉన్న‌ప్పుడు.. టీఆర్ ఎస్ చేరినా ఆయ‌నలా రాజ‌కీయాలు మ‌రెవ‌రూ చేయ‌లేదు. అవినీతి రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటారు. అభివృద్ధి ప‌నుల‌పై ఫోక‌స్ పెడ‌తాడు. విమ‌ర్శ‌ల‌కు తావివ్వ‌రు. ముఖ్య‌మంత్రి అయినా.. సామాన్య కార్య‌క‌ర్తకైనా తాను చెప్ప‌ద‌లుచుకుంది సూటీగా చెబుతారు. ముఖం మీద‌నే క‌డిగేస్తారు. గ‌ర్వం అని కొంద‌రంటారు. కానీ ఆయ‌న‌చేసిన అభివృద్ధే జిల్లాలో ఆయ‌న్ను తిరుగులేని నాయ‌కుడిని చేసింది. మ‌రి ఆయ‌న త‌న‌యుడు కూడా అలాగే రాజ‌కీయాల్లో ఎదుగుతాడా. తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనిపంచుకుంటాడా?

Recommended For You

Comments are closed.