పాపం కాంగ్రెస్ నాయ‌కుల‌కు ఎంత క‌ష్టం వ‌చ్చింది..?

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి మ‌రీ దారుణంగా త‌యారైంది. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ముంచుకొస్తున్నా ఓటు అడిగేందుకు కూడా ధైర్యం చాల‌డం లేదు. వెళితే జ‌నాలు వేసే ప్ర‌శ్నల‌కు త‌ల ఎక్క‌డ పెట్టుకోవాలో అర్ధం కావ‌డం లేదు. ఇది ఎవ‌రో అంటున్న మాట కాదు.. సాక్షాత్తూ పార్టీ రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్ర‌భాక‌ర్ చెబుతున్న మాట‌. పార్టీ తిరుగులేని లాయల్టీ చూపించే పొన్నం ఆవేద‌న ఇది. కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు ఎవ‌రిని స్థానిక ఎన్నిక‌ల్లో నిల‌బెట్టినా చివ‌రి దాకా పోటీలో ఉంటారా.. మ‌ధ్య‌లోనే అమ్ముడుపోతారా.. ఒక‌వేళ గెలిచినా వారు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటార‌న్న గ్యారెంటీ ఏంటి అంటూ జ‌నాలు నిల‌దీస్తున్నార‌ట‌. దీనికి స‌మాధానం చెప్ప‌లేక‌పోతున్నామ‌ని.. కొంద‌రు స్వార్ధ ప‌రుల కార‌ణంగా పార్టీనే న‌మ్ముకుని.. పార్టీ కోసం ప‌నిచేస్తున్న త‌మను న‌మ్మ‌డం లేద‌న్నారు. అందుకే తాను ఎంపీగా బ‌రిలో దిగ‌గానే పార్టీ మార‌న‌ని.. బాండ్ రాసిచ్చాన‌ని గుర్తుచేశారు. ఇప్పుడు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా పోటీచేసే నాయ‌కులు కూడా ఖ‌చ్చితంగా న్యాయ‌ప‌రంగా చెల్లుబాటు అయ్యేవిధంగా బాండ్ తీసుకుంటామ‌ని అంటున్నారు.. వీరిని చూస్తే జాలేస్తోంది.. రేపోమాపో సిఎల్పీ కూడా విలీనం అవుతుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతున్న స‌మ‌యంలో స్థానిక సంస్థ‌ల ప్ర‌తినిధులను ఏం కాపాడుకుంటారు..?

Watch Video:

Recommended For You