ద‌టీజ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌….!

పవన్ కళ్యాణ్ పాలిటిక్స్…!

మాట‌ల‌తో మ‌భ్య పెట్టేర‌కం కాదు.. కొంద‌రు విమ‌ర్శ‌లు చేసిన‌ట్టు సీజ‌న‌ల్ పొలిటిక్స్ ఆయనవి కాదు.. కేవ‌లం ప్ర‌శ్నిస్తాన‌ని మాత్ర‌మే చెప్పాడు. అదే చేస్తున్నాడు. మరి  ఎందుకు అంత ఉలుకు. అవును ప‌వ‌న్ క‌ళ్యాణ్ విమ‌ర్శ‌ల‌ చేయడంలో త‌డ‌బ‌డ‌వ‌చ్చు. కానీ తాను చెప్ప‌ద‌లుచుకుంది నిక్క‌చ్చిగా జనం ముందుంచాడు. మాట‌లు హ‌ద్దులు మీరి ఉండ‌వ‌చ్చు..  కానీ నాయ‌కులు చేసిన మోసం ముందు చాలా చిన్న ప‌దాలు. నేటి నాయ‌కుల నోటి దూల ముందు అస‌లు అవి విమ‌ర్శ‌లే కాదు. ప‌వ‌ర్‌స్టార్ ఇంకా ఘాటుగా మాట్లాడాల్సి ఉండాల్సింది..  కానీ దేశ భ‌క్తుడిగా ఇంత‌కంటే దారుణంగా విమ‌ర్శించ‌లేని సరిహద్దులు దాటలేని స‌గ‌టు భార‌తీయుడు. దేశ‌భ‌క్తిగ‌ల పౌరుడు. మాయ‌మాట‌లు చెప్పి మ‌భ్య పెట్టి ప‌బ్బం గడుపుకునే నాయ‌కుల్లాగా మాట్లాడ‌క‌పోవ‌చ్చు. కానీ మ‌న‌సులో ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్పే ఆవేశ‌మున్న నవతరం నాయకుడు. కాదు సాధార‌ణ పౌరుడు. 

వీరాభిమానులు ఉన్నారు… ప్రాణ‌మిచ్చే జ‌న‌సందోహం ఉంది.. అయినా ఎప్పుడూ ఆయ‌న మాట జార‌డు. ప‌ద్ద‌తిగా ఉండాలంటాడు. జ‌నం హ‌క్కుల కోసం ఉద్య‌మించాల్సిన అవ‌స‌రం లేద‌న్నాడు.. ఈ బాధ్య‌త తీసుకుంటామ‌ని ప్ర‌జాప్ర‌తినిధులుగా ఎదిగిన వారి ప‌ని  అన్నాడు. గ‌ట్టిగా గుర్తు చేశారు. అవును జ‌నాల ఓట్ల‌తో గెలిచిన వారు.. వారి అభిప్రాయాల‌ను గుర్తించి పోరాటం చేయ‌లేరా? ఇదే ప్ర‌శ్నించాడు. నాడు త‌న భుజం ప‌క్క‌న నిల‌బ‌డి త‌న ముందు ఇచ్చిన హామీల‌ను గుర్తు చేశాడు. అవును వాడు మ‌గాడ్రా బుజ్జి.. రెండు పాచిపోయిన ల‌డ్డూలు ఇచ్చాడ‌న్నాడు.. ఈ రెండు ల‌డ్డూలు ఒక‌టి సుజ‌నా చౌద‌రి అయితే.. రెండోది ఆశోక్‌గ‌జ‌ప‌తి రాజుకు ఇచ్చిన ప‌ద‌వి అని ప‌వ‌న్ అర్ధం కావొచ్చు. అంతుకుమించి రాష్ట్రానికి, అధికార పార్టీకి ఏ ప్ర‌యోజ‌నం రాలేదు. 
కేంద్రం ఇవ్వాల్సిన దాని గురించే కాదు.. రాష్ట్రం చేత‌ల‌ను ఎండ‌గ‌ట్టిన రైతు ప్రేమికుడు. అవును రాజ‌ధాని కోసం భూములు ఇచ్చిన వారికి న్యాయం చేయ‌మ‌న్నాడు. అభివృద్ధి అంటే వేల ఎకరాలు భూములు తీసుకోవ‌డం కాద‌న్నాడు. వేల కోట్ల సంపాదించ‌డం కాద‌ని గుర్తు చేశాడు. రాజ‌కీయాలు చేసేంత గొప్ప‌వాడిని కాద‌న్నాడు. మ‌హానుభావుల చెంత‌న నిల‌బ‌డే ఆద‌ర్శ‌మూర్తిని కాకపోవచ్చన్నాడు. కానీ ఇప్పటి అవ‌కాశ‌వాద రాజ‌కీయాలు చేసేంత నీచుడ్ని మాత్రం కాద‌న్నాడు. ప‌ద‌వులు కోసం రాజ‌కీయాలు చేయ‌న‌ని చెప్పాడు. మ‌నిషి నిద్ర‌మాత్ర‌మే పోడు.. ధ్యానంలోనూ కళ్లు తెరిచే ఉంటాడ‌ని స్ప‌ష్టం చేశాడు. మొత్తంగా కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు రాజ‌కీయాల్లో చిన్న‌వాడైనా త‌న అబిప్రాయాన్ని చెప్పాడు. రాష్ట్ర యువ‌త మ‌న‌సులోని మాట చెప్పాడు. వారి ప్ర‌తినిధిగా చెప్పాడు. త‌న‌ను విమ‌ర్శించే వారికీ స‌మాధానం చెప్పాడు. ద‌టీజ్ ప‌వ‌ర్‌స్టార్‌.

Recommended For You

Comments are closed.