తోటవాణి బీజేపీలో చేరుతున్నారా?

తోటవాణి కమలం గూటికి చేరుతున్నారా? టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరి తోట కుటుంబంతో దౌత్యం నడిపినట్టు తెలుస్తోంది. రాంమాధవ్‌ ఆదేశాలతో కాపు సామాజికవర్గానికి చెందిన తోట కుటుంబాన్ని పార్టీలోకి తీసుకొచ్చేందుకు సుజనా రంగంలో దిగారు. ఇందులో భాగంగా ఆయన చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. తోటవాణి కూడా చేరడానికి రంగం సిద్దం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. తోట వాణి ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. పెద్దాపురం అసెంబ్లీ నుంచి పోటీచేసి టీడీపీ అభ్యర్ధి మాజీ డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప చేతిలో ఓటిమిపాలయ్యారు. దీంతో కొంతకాలంగా రాజకీయాల్లో సైలెంట్‌ గా ఉన్నారు తోటవాణి. భర్త, మాజీ మంత్రి, మాజీ ఎంపీ తోట నర్సింహం ఆరోగ్యం సరిగా లేకపోవడంతో రాజకీయాలకు దూరమయ్యారు. కాంగ్రెస్‌ లో ఉన్న తోట నర్సింహం 2014 ముందు టీడీపీలో చేరారు. ఆయనకు కాకినాడ ఎంపీ సీటు ఇచ్చారు. గెలిచిన తర్వాత టీడీపీ లోక్‌ సభా పక్ష నేత పదవి కూడా ఇచ్చారు. అయితే 2019 నాటికి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తోట వాణి పూర్తిస్థాయి రాజకీయాల్లో వచ్చారు. ఎన్నికలకు ముందు జగ్గంపేట లేదా పెద్దాపురం అసెంబ్లీ సీట్లు అడిగారు. కాదని చంద్రబాబు ప్రత్యామ్నాయం చూపించినా వారు అంగీకరించలేదు. దీంతో జనసేనతో చర్చలు జరిపారు. కానీ చివరకు జగన్‌ పిలుపుతో వైసీపీలో చేరారు. పెద్దాపురం టికెట్‌ వాణికి కేటాయించారు. స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. దీంతో సైలెంట్‌గా ఉన్న తోట కుటుంబపై బీజేపీ నాయకులు దృష్టిపెట్టారు. జిల్లాలో కాపు సామాజికవర్గం కీలకం కావడంతో తోటవాణిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాల్లో ఉన్నారు. కుటుంబానికి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. ఆమె మెట్టినిల్లు తోట కుటుంబానికి జిల్లాలో పేరుంది. ఆక ఆమె తండ్రి మెట్ల సత్యనారాయణ. ఆయన కూడా రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు ఉన్నారు. మంచి నాయకుడిగా, ప్రజామనిషిగా పేరుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఆయన కూతురుగా తోటవాణి కూడా రాజకీయవారసత్వం కొనసాగిస్తున్నారు. సమైక్య ఉద్యమంలో పాల్గొన్నారు. దీక్ష చేసి మంచి పేరు సంపాదించారు. ఆమెను బీజేపీలోకి తీసుకుంటే.. పార్టీకి సామాజిక సమీకణాలు కలిసివస్తాయిన బీజేపీ భావిస్తోంది. బీజేపీలో తోటవాణి చేరికపై ఇప్పటికే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే దీనిపై విమర్శలు వస్తున్నాయి. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో వాణి విఫలమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో రాజకీయంగా ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇటీవల ఎన్నికల్లో అదే నిజమైంది. పార్టీ మారడం… చివరి నిమిషం వరకూ సందిగ్ధం వల్ల ఓటమి తప్పలేదు. ఇప్పుడు మళ్లీ ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు. కానీ రాష్ట్రంలో బీజేపీ బలం ఎంత? ఎవరో చెప్పారని చేరినా… భవిష్యత్తు ఉంటుందా? రాజకీయంగా వేసే అడుగులు జాగ్రత్తగా వేయాలి.. వైసీపీ అధికారంలో ఉంది. కుటుంబానికి నేపథ్యం ఉంది. అవకాశాలు ముందుముందు వస్తాయి. కానీ ఇలా అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటే.. భవిష్యత్తు ఉండదని అంటున్నారు. తోటవాణి అన్నీ ఆలోచించే నిర్ణయం తీసుకున్నారా? వెళితే రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయా? తూర్పుగోదావరి జిల్లాలో తోట కుటుంబానికి రాజకీయ నేపథ్యంలో మాజీ మంత్రి, మాజీ ఎంపీ తోట నర్సింహం కుటుంబం రాజకీయాల్లో

Recommended For You