టీడీపీ అవుట్.. టీఆర్ఎస్ ఇన్‌..?


ఆప్షన్ ఉందిగా?

టీడీపీ-బీజేపీల మ‌ధ్య అంత‌రం పెరుగుతోంది. ప్ర‌త్యేక హోదా వివాదం మిత్రుల మ‌ధ్య చిచ్చు రాజేసింది. ప‌ర‌స్స‌రం 
విమ‌ర్శ‌లతో క్ర‌మ‌క్ర‌మంగా దావాన‌లంగా వ్యాపిస్తోంది. ఇక టీడీపీ నేత‌లు కూడా జ‌నాల్లో బ‌దనాం కాకుండా ఉండాలంటే క‌మ‌ల‌నాధుల‌ను ఇక ఉపేక్షించ‌డం అన‌వ‌స‌రం అన్న అభిప్రాయానికి వ‌చ్చారు. అటు బీజేపీ కూడా సొంతంగా ఎద‌గాల‌న్న కుతుహ‌లంలో భాగంగా టీడీపీతో తెగ‌తెంపుల‌కు సిద్దంగా ఉంది. అవ‌స‌ర‌మైతే విడిపోయిన త‌ర్వాత కేంద్రం చేత ప‌థ‌కాలు, రాష్ట్రానికి ప్యాకేజీలు ప్ర‌క‌టించి ల‌బ్ధి పొంద‌వ‌చ్చ‌ని ఆశిస్తోంది. విజ‌య‌వాడ‌లో జ‌రిగిన కోర్ క‌మిటీ మీటింగ్‌లో కూడా దాదాపు ఇదే అబిప్రాయం వ్య‌క్తం అయింది. ఇందులో భాగంగానే సిద్దార్ధ‌నాథ్ సింగ్ ద్వారా హోదా రాద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. రాష్ట్రానికి చాలా చేశామ‌ని బ‌ల్ల‌కుద్ది మ‌రీ చెబుతోంది. ఇదంతా టీడీపీ నేత‌ల్లో అస‌హ‌న జ్వాల‌లు ర‌గిలిస్తున్నాయి. టీడీపీ కూడా దీనిని అవ‌కాశంగా మ‌లుచుకునే ఛాన్సుంది. ఏపీలో అనుకున్న స్థాయిలో అభివృద్ధి జ‌ర‌గ‌లేదు. అమ‌రావ‌తి నిర్మాణం కూడా ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా ఉంది. దీంతో ప్ర‌జ‌ల్లో కూడా అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఈ నేప‌థ్యంలో బీజేపీతో తెగ‌తెంపులు చేసుకుని కేంద్రంపై న‌మ్మ‌కం పెట్టుకుంటే నిరాశ‌ప‌రిచింది… ఇక బ‌య‌ట‌కు వ‌చ్చాం..అంద‌రం క‌లిసి పోరాడ‌దాం అని ప్రజలకు చేరువ కావ‌చ్చు. మ‌రో రెండేళ్లు గ‌డిపి జ‌నాల‌ను త‌మ‌వైపు నుంచి మ‌ళ్ల‌కుండా చేయ‌వ‌చ్చు. కేంద్రంపై యుద్ధం చేసే అవకాశం కూడా ప్ర‌తిప‌క్షాల‌కు ఇవ్వ‌కుండా మ‌న‌మే చేయ‌వ‌చ్చు అన్న అభిప్రాయం టీడీపీ వ‌ర్గాల్లో ఉంది. ఇలా ఇద్ద‌రు మిత్రుల మ‌ధ్య ప్ర‌త్యేక హోదా వివాదంతో రాజకీయ ప్రయోజనాల కోసం తెగ తెంపులకు సిద్దపడుతున్నారు. 
స‌రిగ్గా ఇదే స‌మ‌యం కోసం వేచి చూస్తున్న తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ బీజేపీతో జ‌త‌క‌లిసే అవకాశం ఉంది. కేంద్రంలో అధికారం పంచుకోవ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. టీడీపీ బ‌య‌ట‌కు వ‌స్తే… టీఆర్ఎస్ ఎంట్రీ ఖాయ‌మంటున్నారు.రాజ‌కీయాల్లో ఏదైనా సాద్య‌మే.. మ‌రి కాల‌మే దీనికి సమాధానం చూపాలి.

Recommended For You

Comments are closed.