టిఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్ధులు వీరే

Regional Telangana

లోక్‌సభ అభ్యర్ధుల ఎంపికపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టి సారించారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్‌లకే ఛాన్స్‌ ఇవ్వడం, ముందుగా అభ్యర్ధులను ప్రకటించడంతో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోని 16లోక్‌సభ స్థానాల్లో అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి ప్రవేట్ స‌ర్వేలు చేయించిన‌ట్టు స‌మాచారం. ఇప్పుడున్న ఎంపీలకు ఎమ్మెల్యేలకు స‌ఖ్యత లేదు. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో అంత‌ర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో బయ‌ట‌ప‌డింది. అందుకే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో వాటి ప్రభావం ప‌డ‌కుండా కేసిఆర్ జాగ‌త్ర ప‌డుతున్నారు. ఆ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలను పిలిచి ఎంపీలను గెలిపించే బాధ్యతలు అప్పగిస్తున్నారు.

Watch Video:

మహబూబ్‌నగర్‌ జిల్లాకు సంబంధించి ఇద్దరు అభ్యర్ధులకు కేసీఆర్‌ లైన్‌క్లియర్‌ చేశారు. మహబూబ్‌ నగర్‌ నుంచి సిట్టింగ్‌ జితేందర్‌ రెడ్డి లోక్‌సభలో పార్టీపక్ష నేతగా ఉన్నారు. మరోసారి ఆయనే అభ్యర్ధి అంటున్నారు. నాగర్‌కర్నూల్‌ అభ్యర్ధిగా మాజీ మంత్రి పి.రాములు పేరు బలంగా వినిపిస్తోంది. ఇక గుత్తా సుఖేందర్ రెడ్డి ని మండలికి పంపే యోచనలో ఉన్నారు. దీంతో నల్గొండ ఎంపీగా కేసీఆర్‌ పోటీచేస్తారని ప్రచారముంది. కేసీఆర్‌ చేయని పక్షంలో పల్లా రాజేశ్వరరెడ్డి, బండ నరేందర్‌ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. చాడ కిష‌న్ రెడ్డి , చిన్నప రెడ్డి కూడా ప్రయ‌త్నిస్తున్నారు. ఇక పెద్దపల్లి నుండి వివేక్‌ వెంకటస్వామి పేరు ఖరారైనట్లేనని ప్రచారం జరిగుతోంది. అయితే స్థానిక ఎమ్మెల్యేలు నిరాకరిస్తుండడంతో ఇతర పేర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. పెద్దపల్లిలో రేసులో APPSC ఛైర్మన్ ఘంటా చక్రపాణి, మల్లేపల్లి లక్ష్మయ్య పేర్లు పరిశీలిస్తున్నారు. ఇక ఖమ్మం ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డినే పోటీలో పెట్టే అవకాశం ఉంది. కేటీఆర్‌ ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. మాజీమంత్రి తుమ్మల పేరు వినిపించినా ఆయన ఆసక్తిగా లేరని తెలుస్తోంది. మల్కాజ్‌గిరి నుంచి బండి రమేష్‌ను నిలిపే అవకాశముంది. మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీదేవి యాదవ్ కూడా ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక జహీరాబాద్‌ నుంచి పాటిల్‌, మెదక్‌ నుంచి కొత్త ప్రభాకర్‌ రెడ్డి, నిజామాబాద్‌ నుంచి కవిత, కరీంనగర్‌ నుంచి వినోద్‌ పేర్లు దాదాపు ఖాయం. వరంగల్‌ నుంచి దయాకర్‌ ను మార్చేయోచనలో సీఎం ఉన్నట్టుతెలుస్తోంది. భువనగిరి నుంచి బూర నర్సయ్యగౌడ్‌, మహబూబాబాద్‌ నుంచి సీతారాంనాయక్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక చేవెళ్ల నుంచి మాజీ మంత్రి మహేందర్‌ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి కుటుంబం వస్తుందని.. వారసుడికి ఇస్తారని ప్రచారమూ ఉంది. సికింద్రాబాద్‌ నుంచి తలసాని వారసుడి పేరు తెరమీదకు వస్తుంది. ఆదిలాబాద్‌ నుంచి నగేష్‌ మరోసారి పోటీచేస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. మొత్తానికి సిట్టింగులకు అగ్రస్థానం వేసి.. అవసరం అనుకుంటూనే మార్చే యోచనలో కేసీఆర్‌ ఉన్నారు.