జగన్ మంత్రివర్గం ఇదేనట.. నిజమేనా?

జగన్ తన మంత్రివర్గాన్ని సిద్దం చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం  ఊపందుకుంది. స్పీకర్ పదవి నుంచి కార్యదర్శల దాకా.. డీజీపీ నుంచి సీఎస్ దాకా జగన్మోహన్ రెడ్డి పక్కా ప్లాన్ చేసుకున్నట్టు పార్టీ వర్గాలంటున్నాయి. మొదటి శత్రువు అయిన చంద్రబాబును ిఇరుకున పెట్టడానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావును స్పీకర్ స్థానంలో కూర్చోబెడతారని తెలుస్తుంది. ఇక ఆయనకు అత్యంత సన్నిహితుడు పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డికి హోంమంత్రి పదవి ఇస్తారట. అయితే పెద్ది కూడా చంద్రబాబుకు ఒకప్పుడు స్నేహితుడు. కాలేజీ రోజుల్లో అత్యంత సన్నిహితులు కానీ తర్వాత రాజకీయంగా బద్ద శత్రువులయ్యాయి. గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు ఒత్తిడికి తట్టుకుని.. ఎదురుదాడి చేయడంలో తనకు అండగా ఉన్నబుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, గడి కోట శ్రీకాంత్ రెడ్డి, రోజా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనీల్ కుమార్ యాదవ్ లకు చోటు ఖాయమంటున్నారు. వీరితో పాటు లోకేష్ ను ఓడిస్తే ఆళ్లకు కూడా బెర్త్ ఖాయమని ఇప్పటికే ప్రకటించారు. ఇక సీనియర్ల కోటాలో ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాంలకు అవకాశం ఖాయమట..అవంతి శ్రీనివాసరావు పేరు కూడా వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. అందులో ఒకరిద్దరికి అవకాశం ఉంటుందని.. బయట ప్రచారం జరుగుతున్నా.. జగన్ మాత్రం ఫిరాయింపుల విషయంలో నిక్కచ్చిగా ఉంటారట.. పార్టీలో చేరాలనుకుంటే.. రాజీనామా చేసి గెలిచిరావాల్సిందేనని కండీషన్ పెడతారట.. మొత్తానికి జగన్ అధికారంలోకి వస్తామని ధీమాగానే ఇవన్నీ సిద్దం చేసుకున్నట్టు ప్రచారం.. మరి ఇందులో నిజముందా? చూడాలి..

Recommended For You