జగన్ ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిధి ఎవరో తెలుసా..?

వైసీపీ అధికారంలో వస్తే ప్రమాణస్వీకారం ఎప్పుడు చేయాలి.. ఎలా చేయాలి.. అన్ని అంశాలపై జగన్ పూర్తిగా క్లారిటితో ఉన్నారట. ప్రజాతీర్పు అనుకూలంగా వస్తే భారీ సభ ఏర్పాటు చేసి.. లక్షలాది మంది మధ్య ప్రమాణస్వీకారం చేయడంతో పాటు… హామీ ఇచ్చిన ఫైల్స్ పై తొలి సంతకాలు చేయనున్నారట.. గతంలో వై ఎస్ కూడా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బారీ జనసందోహం మధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు జగన్ కూడా తండ్రిని అనుసరించనున్నట్టు తెలుస్తోంది. అయితే జగన్ తన ప్రమాణస్వీకారానికి ముఖ్య అతిధిగా ఎవరిని పిలుస్తారన్న చర్చ మొదలైంది. అయితే జగన్ తన ప్రమాణస్వీకారానికి కేసీఆర్ ను చీఫ్ గెస్ట్ గా పిలుస్తారని తెలుస్తోంది. జాతీయరాజకీయాల్లో కేసీఆర్ తో కలిసిపనిచేస్తానని జగన్ గతంలోనే ప్రకటించారు. అంతేకాదు.. కేసీఆర్ కూడా జగన్ కు సహాయసహకారాలు అందిస్తామన్నారు. ఈ నేపథ్యంలో పెద్ద దిక్కుగా ఉన్న కేసీఆర్ వస్తారని పార్టీ వర్గాలంటున్నాయి. జగన్ కూడా ఎన్నికలకు ముందు పెద్దగా జాతీయ నాయకులె ఎవరితలోనూ సవాసం చేయలేదు. కేసీఆర్ మినహా ఎవరిని ఆయన కలవలేదు.. జాతీయ రాజకీయాల్లో జోక్యం కూడా చేసుకోలేదు. ఫోకస్ అంతా కూడా ఏపీపైనే పెట్టారు. కేసీఆర్ మాత్రమే ఆయనకు మద్దతుగా ఉన్నారు. కాబట్టి కేసీఆర్ ను చీఫ్ గెస్ట్ అని పార్టీ వర్గాలంటున్నాయి. గతంలో కూడా కేసీఆర్ ను జగన్ గ్రుహ ప్రవేశానికి పిలిచినా కూడా .. ఒకేసారి ప్రమాణస్వీకారానికి వస్తాలే ముఖ్యమంత్రిగా మర్యాదులు చేద్దువంటూ కేసీఆర్ అన్నట్టు సమాచారం. మరి జగన్ అధికారంలోకి వచ్చి.. కేసీఆర్ ను చీఫ్ గెస్ట్ గా పిలిచి.. అతిధి మర్యాదులు చేస్తారా? చూడాలి జనం తీర్పు ఎలా ఉందో…

Recommended For You