చంద్ర‌నాట‌కంలో ‘సుజ‌నా‘త్మ‌క పాత్ర‌..!

భలేభలే డ్రామాలోయ్…!

రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఉండ‌దు.. ఏ రాష్ట్రానికి అద‌నంగా నిధులు ఉండ‌వు.. ఎవరికి వారు అవకాశాలు స్రుష్టించుకోవాలి.. డెవలప్ మెంట్ సాధించాలి. ఇదే కేంద్రం చెప్ప‌ద‌లుచుకుంది. కుండబద్దలు కొట్టింది. ఏపీలో ఉన్న సెంటిమెంట్ దృష్ట్యా దీనికి కాస్తంత డ్రామా జోడించి.. నాట‌కీయంగా చెప్పారు. ఇవ్వ‌లేమ‌ని తేల్చేశారు. జ‌నాలే అర్ధం చేసుకోవాలి.. మేం ఇంత‌కంటే అర్ధ‌మ‌య్యేలా చెప్ప‌లేం.. మీరే స‌ర్ధుకోండి అని ప్ర‌భుత్వానికి కూడా సంకేతాలు పంపారు. మహా అయితే విభజన చట్టంలో ఉన్నవి  ఒకటి రెండు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం… అని అరుణ్ జైట్లీ జాగ్రత్తగా, పద్దతిగా చెప్పారు.

ఏపీ ప్ర‌భుత్వం కూడా కేంద్రంతో క‌లిసి డ్రామాలు ఆడింది. అవును ఇదే నిజం. అరుణ్‌జైట్లీ ప్రెస్ మీట్ త‌ర్వాత అన్యాయం జ‌రిగింద‌ని.. ఏమీ ఇవ్వ‌లేద‌ని తెలుగు దేశం అంటోంది. వాస్త‌వానికి అరుణ్‌జైట్లీ ఏం చెప్ప‌బోతున్నారో చంద్ర‌బాబుకు ముందే తెలుసు. రాష్ట్రానికి ఏమీ ఇవ్వ‌ర‌ని తెలుసు. కానీ ప్ర‌జ‌ల ముందు బెట్టు చేసిన‌ట్టు రోజంతా క‌ల‌రింగ్ ఇచ్చారు. అంతే త‌ప్ప ఆయ‌న‌కు తెలీయ‌కుండా కేంద్రం ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌దు. ఆర్ధిక స‌హాయ మంత్రి కూడా కానీ సుజ‌నాచౌద‌రి ఏ హోదాలో అరుణ్‌జైట్లీ ప‌క్క‌న కూర్చుని ప్రెస్‌మీట్‌లో  పాల్గొంటారు. చంద్ర‌బాబు అనుమ‌తి లేకుండా ఆయ‌న కేంద్రంలో  ఈప్ర‌క‌ట‌న ఇప్పించ‌డానికి చ‌క్రం తిప్పుతారా? ప‌క్కా వ్యూహంతోనే చంద్ర‌బాబు రోజంతా హైడ్రామా న‌డిపించారు. తన‌ను కేంద్రం ర‌మ్మ‌ని పిలిచిన‌ట్టు.. తాను వెళ్ల‌న‌ని మారాం చేసిన‌ట్టు ప్ర‌చారం వ‌చ్చేలా చేసుకున్నారు. నిజంగా కేంద్రం ఏమిస్తుందో తెలియ‌కుండానే అరుణ్‌జైట్లీ ప‌క్క‌న త‌న ప్ర‌తినిధి సుజ‌నాను ఎందుకు కూర్చోబెట్టిన‌ట్టు. ఇదోక్క‌టి చాల‌దా టీడీపీ తెర వెన‌క పాత్ర ఏమిటో..? చ‌ంద్ర‌బాబుకు తెలియ‌కుండానే బీజేపీతో సుజ‌నా చేతులు క‌లిపారా? 

ఆర్ధిక లోటు అంటూ రెండు వేల కోట్లు ఇవ్వ‌డానికి ఇంత‌కాలం ప‌ట్టింంది. 16వేల కోట్ల ఆర్ధిక లోటు  అదీ రెండ‌డేళ్లుగా ఇవ్వ‌లేదు… అది పూడ్చ‌డానికి ఎంత‌స‌మ‌యం ప‌డుతుంది. పోల‌వ‌రంం ఎన్ని సంవ‌త్స‌రాల్లో పూర్తి చేస్తారు. ఇంత‌కాలం ఖ‌ర్చు చేసిన డ‌బ్బులు ఎవ‌రిస్తారు? అదే కాదు.. అస‌లు పోల‌వ‌రం ఇప్ప‌ట్లో కాద‌ని కేంద్రానికి కూడా తెలుసు దీనికి కార‌ణం.. ఒడిషా నుంచి వ‌స్తున్న తీవ్ర అభ్యంత‌రాలు. పోల‌వ‌రంపై కేంద్రం ఒక అడుగు ముందుకు వేస్తే దీనికి వ్య‌తిరేకంగా వంద అడుగులు ఒడిషా వేస్తోంది. పార్ల‌మెంట్‌లో సైతం ప‌లుమార్లు ఒడిషా ఎంపీలు మండిప‌డ్డారు. సుప్రీంలో కేసు ఉండ‌గా కేంద్రం నిధులు ఎలా ఇస్తుంద‌ని ప్ర‌శ్నించారు. సో… దీనిపై ఇప్ప‌ట్లో ఆశ‌లు లేన‌ట్టే. 2018 నాటికి అవుతుంద‌ని ఇక్క‌డ ఏపీ, అక్క‌డ కేంద్రం ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతుంది. ఇదే కాదు విభ‌జ‌న చ‌ట్టంలో ఇచ్చిన ఏ హామీపైనా స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న లేదు. క‌నీసం రైల్వే జోన్ కూడా ఇస్తామ‌న‌డం లేదు. ఇప్ప‌టికే వంద‌సార్లు అటు పార్ల‌మెంట్‌లో.. ఇటు వెలుపలా.. చెప్పిన మాటే మ‌ళ్లీ చెప్పారు. విభ‌జ‌న హామీలు నెర‌వేర్చుతాం సింగిల్ పాయింట్ తీర్మానం.

త‌ల‌కిందులు త‌పస్సు చేసినా కేంద్రం పైసా రాల్చ‌దు. ఈ విష‌యం చంద్ర‌బాబుకు తెలుసు.. మంత్రుల‌కు అర్ధ‌మ‌యింది. ఎటు వ‌చ్చి ప్ర‌జ‌లే ప్ర‌తిసారీ చ‌ర్చ వ‌చ్చిన‌ప్పుడు ఆశ‌లు పెట్టుకోవ‌డం.. ప్ర‌క‌ట‌న చూశాక నిరాశ ప‌డ‌డం. మ‌ళ్లీ ఏపీకి టోపీ అని.. ఆశ‌లు ఆవిరి అని.. గ‌ల్లంతు అని హెడ్డింగులు చూసి బాధ‌ప‌డ‌డం అల‌వాటుగా మారింది. కొంత‌కాలం అయితే జ‌నం కూడా అర్ధం చేసుకుంటారు.. అవునులే రెండేళ్ల‌లో చంద్ర‌బాబు ఏం చేశారు.. కేంద్రం కూడా సాయం చేయ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది.. అని బీజేపీ నేత‌లు అన్న‌ట్టు ఎవ‌రికి వారు ప్ర‌జ‌ల‌తో ఆడుకుంటున్నారు.

Recommended For You

Comments are closed.