గుడ్ ఎండ్ బ్యాడ్

రెండూ ఘ‌న‌త‌లూ ఆయ‌నవే?

నరేంద్రమోడి, ప్రధానమంత్రి

ఇండియ‌న్ రైల్వేల్లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీ రెండు ఘ‌న‌త‌లు సొంతం చేసుకున్నారు. అవును రైల్వేల్లో ప్ర‌ధాన‌మంత్రి ఏంట‌నుకుంటున్నారా? దేశంలో అత్యంత ప‌రుశుభ్రంగా ఉన్న రైల్వేస్టేష‌న్ సూర‌త్ అయితే… అత్యంత దారుణంగా ఉంది వార‌ణాసి. అదేంటి రెండింటికి మోడీకి సంబంధం ఏంట‌ని పెద్ద‌గా ఆలోచించ‌న‌వ‌స‌ర‌నం లేదు.. ఇందులో వార‌ణాసి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి మోడీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. సూర‌త్ ఆయ‌న సొంతం రాష్ట్రం గుజరాత్‌లో ఉంది. అందుకే ఈ రెంఢు ఘ‌న‌త‌లు ఆయ‌న‌కే ద‌క్కాయి. దేశంలో రైల్వేస్టేష‌న్లు, ట్రాకులు, ఇత‌ర రైల్వే ఆవ‌ర‌ణ‌లు ఎలా ఉన్నాయి.. పారిశుధ్యం ఎలా ఉందో తెలుసుకోవ‌డానికి జ‌న‌వరి, ఫిభ్ర‌వ‌రి నెల‌ల్లో ఐఆర్‌సిటిసి స‌ర్వే చేసింది. వాస్త‌వాల‌ను తెలుసుకునేందుకు ప్ర‌యాణీకుల నుంచి 40 ర‌కాల అంశాల‌పై స‌ర్వే జ‌రిపారు. మొత్తం 407 స్టేష‌న్ల‌లో స‌ర్వే జ‌రిగింది. 50 కోట్ల‌కు పైగా ఆదాయం వ‌స్తున్నా… వార‌ణాసి వంటి స్టేష‌న్లు చెత్త‌మ‌యంగా ఉన్నాయ‌ని ప్ర‌యాణీకులు చెప్పార‌ట‌. సూర‌త్‌లో ప్ర‌జ‌లు బాగుంద‌న్నారు. రెండో స్థానంలో కూడా గుజ‌రాత్‌కు చెందిన రాజ్‌కోట్ నిలిచింది. తాజా నివేదిక‌ల ఆధారంగా రైల్వే సంస్థ స్వ‌చ్చ్ అభియాన్‌లో భాగంగా చ‌ర్య‌లు తీసుకుంటార‌ట‌. స్వ‌చ్ఛ్ భార‌త్ మొద‌లుపెట్టిన మోడీ.. త‌న సొంత నియోజ‌కవ‌ర్గంలో అయినా ఆయా శాఖ‌ల్లో ప‌థ‌కం అమ‌ల‌య్యేలా చూస్తే బాగుండేది…

Recommended For You

Comments are closed.