ఖమ్మం కబర్లు


పాలేరుపై పల్లా నజర్?
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే రాంరెడ్డి వెంక‌ట‌రెడ్డి మ‌ర‌ణంతో ఖాళీ ఏర్ప‌డింది. రాబోయే ఆరు నెల‌ల్లో ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఏక‌గ్రీవానికి స‌హ‌క‌రించాల‌ని అసెంబ్లీలో కాంగ్రెస్ కోరినా సిఎం కేసీఆర్ స్పందించ‌లేదు. అంటే దాదాపు పోటీకే ఆయ‌న మొగ్గుచూపుతున్నారు. గ‌తంలో కూడా నారాయ‌ణఖేడ్ ఎన్నిక‌ల్లో కూడా పోటీ చేసింది. కృష్ణారెడ్డి కుటుంబానికి ఇవ్వాల‌ని కోరినా అధికార పార్టీ అవ‌కాశం ఇవ్వ‌లేదు. పైగా సానుభూతి ఓట్ల‌ను కూడా త‌న‌వైపు తిప్పుకుని భారీ మెజార్టీతో విజ‌యం సాధించింది. ఇప్పుడు కూడా పాలేరులో అదే వ్యూహం అమ‌లు చేయ‌డానికి గులాబీ పార్టీ భావిస్తోంది.

పల్లా రాజేశ్వరరెడ్డి

ఉప ఎన్నిక‌లో అధికార పార్టీ త‌ర‌పున పోటీ చేయ‌డానికి జిల్లా టిఆర్ ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. కొత్త‌గా ప‌క్క జిల్లా నాయ‌కులు కూడా దీనిపై క‌న్నేశారు. ప్ర‌స్తుతం ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ‌, వ‌రంగ‌ల్  ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్సీగా ఉన్న ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి పాలేరు నుంచి పోటీ చేయ‌డానికి  ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌. త‌మ సామాజిక వ‌ర్గం సిట్టింగ్ కావ‌డంతో త‌న‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కేసీఆర్ వ‌ద్ద ప్ర‌తిపాద‌న‌లు పెట్టార‌ట‌. ఎమ్మెల్సీగా ఉండ‌డంతో త‌న‌కు స్థానికత స‌మ‌స్య రాద‌ని.. పైగా ఖ‌మ్మం కార్పోరేష‌న్ ఎన్నిక‌ల్లో త‌న‌వంతు పాత్ర పోషించిన‌ట్టు ముఖ్య‌మంత్రి వ‌ద్ద చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఆర్ధిక బ‌లం, అంగ బలం ఉంది. పైగా జిల్లాలోని విద్యాసంస్థ‌ల అధిప‌తుల‌తో సంబంధాలున్నాయి. త‌మ జిల్లా స‌రిహ‌ద్దు నియోజ‌క‌వ‌ర్గ‌మే కాబ‌ట్టి త‌న‌కు కేటాయించాల‌ని కోరుతున్నార‌ట‌. ప‌ల్లా ప్ర‌తిపాద‌న వెన‌క పెద్ద వ్యూహ‌మే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. న‌ల్ల‌గొండ జిల్లాలో ఇప్ప‌టికే జ‌గ‌దీశ్ రెడ్డి మంత్రిగా ఉన్నారు. కేసీఆర్ కు ఆంత‌రంగికుడు. అదే జిల్లాకు చెందిన ప‌ల్లాకు మంత్రి ప‌ద‌వి సాద్యం కాదు. జ‌గ‌దీశ్ రెడ్డిని కాద‌నుకుంటేనే ప‌ల్లాకు అవ‌కాశం ద‌క్కుతుంది. అందుకు ఖ‌మ్మం జిల్లాలో ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెడితే ఖ‌మ్మం జిల్లా కోటాలో ప‌ద‌వి సాధించవ‌చ్చ‌ని ప‌ల్లా ఎత్తుగ‌డ‌గా చెబుతున్నారు. గ‌తంలో జ‌ల‌గంకు కూడా ప‌ద‌వి వ‌స్తుంద‌ని అనుకున్నా.. సామాజిక‌వ వ‌ర్గం కలిసి రాలేదు. దీంతో ఈ రెండో స్థానం అందుకోవాల‌ని ప‌ల్లా భావిస్తున్నారు. అందుకే ఇటీవ‌ల జిల్లాలో జ‌రిగే ప్ర‌తి పార్టీ ఈవెంట్‌లో ఆయ‌న పాల్గొంటారున్నారు. అన్నింటికి ముందుండి మీడియాలో క‌నిపిస్తున్నారు.
అయితే జిల్లా మంత్రి తుమ్మ‌లకు ఇష్టం లేకుండా సిఎం కేసీఆర్ నిర్ణ‌యం తీసుకోర‌ని పార్టీ వ‌ర్గాలంటున్నాయి. తుమ్మల కూడా ఇందుకు అంగీక‌రించ‌క‌పోవ‌చ్చు. చాలామంది జిల్లా నేత‌లు పార్టీలో ఉన్నారు. వారిని కాద‌ని ప‌క్క జిల్లా వాళ్ల‌కు అవ‌కాశం ఇస్తే తుమ్మ‌ల ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని… తుమ్మ‌ల ఈ ప్ర‌తిపాద‌న‌ను వ్య‌తిరేకించే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాలంటున్నాయి. మ‌రి కేసీఆర్ వ్యూహం ఎలా ఉండ‌బోతుందో చూడాలి.

Recommended For You

Comments are closed.