కూల్ డ్రింక్ యాడ్ చేయనంటున్న తెలుగుతేజం

PV Sindhu get 50 crores deal for advertaisments

కాసుల పంట పండుతోంది.. ఒలంపిక్స్ లో ర‌జ‌త ప‌త‌కంతో జాతి గౌర‌వాన్ని నిల‌బెట్టిన తెలుగు తేజానికి క‌న‌క వ‌ర్షం కురుస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వాలు, ప్ర‌యివేటు సంస్థ‌లు భారీ న‌జ‌రానాలు ప్ర‌క‌టించాయి. ఇప్పుడు మ‌రో అరుదైన బిజినెస్ డీల్ కూడా కుదిరింది. కొంద‌రు క్రికెట‌ర్లు కూడా అందుకోలేని విధంగా ఓ కంపెనీతో 50 కోట్ల డీల్‌కు అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. మూడేళ్ల కాల‌ప‌రిమితి ఉన్న డీల్ ద్వారా ఆమెకు 50 కోట్లు గిట్ట‌నున్నాయి. బేస్‌లైన్ అనే సెల‌బ్రిటీ మేనేజ్‌మెంట్ సంస్థ ముందుకు వచ్చింది. దీనిపై ఈ వారంలోనే సింధు సంత‌కాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. వాస్త‌వానికి ఇంత పెద్ద డీల్ క్రికెట‌ర్లు మిన‌హా మ‌రే ఆట‌గాళ్ల‌కు ద‌క్క‌లేదు. గ‌తంలో సానియా మీర్జా కూడా ఈ స్థాయిలో యాడ్ ఏజెన్సీ నుంచి  సంపాదించలేకపోయింది. ఇది ఓ రికార్డుగా ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు.

సింధుకు దేశంలో ఇప్పుడు క్రేజ్ ఉంది. ఆమె భార‌తీయ మ‌హిళ‌ల‌కు ప్ర‌తినిధిగా మారారు. ఇంత పెద్ద మొత్తం ఆఫ‌ర్ చేయ‌డంలో ఎలాంటి తొందపాటు లేదని కంపెనీ వ‌ర్గాలంటున్నాయి. మహిళా ఉత్పత్తులకు ఆమె బ్రాండ్ చేయగలరని అంటున్నారు. ఇప్ప‌టికే ఖేల్ ర‌త్నాన్ని త‌మ బ్రాండ్ అంబాసిడార్‌గా నియ‌మించుకోవ‌డానికి 13 కంపెనీలు క్యూ క‌ట్టాయ‌ట‌. మ‌రికొన్ని కంపెనీలు సంప్ర‌దిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అయితే సింధు మాత్రం ఓ కండీష‌న్ పెడుతున్నారట. యువ‌త మీద చెడు ప్ర‌భావం చూపే కూల్‌డ్రింక్స్ యాడ్స్ మాత్రం చేయ‌నంటోంది. త‌న ఇమేజ్ డ్యామేజ్ కాకుండా.. అదే స‌మ‌యంలో త‌న‌కు ఆట‌కు ఇబ్బంది లేకుండా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు ప్లాన్ చేయాల‌ని కంపెనీ యాజ‌మాన్యాల‌కు స్ప‌ష్టం చేశార‌ట‌. మొత్తానికి క్రికెటర్లుకు ధీటుగా సింధు ఇప్పుడు ఆదాయంలో ముందుంది.. ఇదే జోరు కొన‌సాగిస్తే.. ఫోర్బ్‌స్ ప‌త్రిక‌లో స్థానం సంపాదించ‌డం ఖాయం అంటున్నారు.

Recommended For You

Comments are closed.