కాంగ్రెస్‌ నాయకుల వలసలు మంచికేనా?

తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ దాదాపు ఖాళీ అవుతోంది. ఎవరికి వారు అధికారపార్టీలో చేరేందుకు తహతహలాడుతున్నారు. కేసీఆర్‌ ను వ్యక్తిగతంగా ధూషించిన జగ్గారెడ్డి వంటివాళ్లు సైతం తమ కుటుంబ రాజకీయ అవసరాలు, ప్రయోజనాల కోసం పార్టీ వీడుతున్నారు. జానారెడ్డి వంటివాళ్లు ఒకరిద్దరు వయసు రిత్యా సైలెంట్‌ అయ్యారు. ఇక ఉత్తమ్‌, భట్టి, శ్రీధర్‌ బాబు, రేవంత్‌ రెడ్డి వంటి వాళ్లు మినహా ఎవరూ మిగిలే పరిస్థితి లేదు. అయితే ఇదంతా పార్టీకే మేలు చేస్తుందన్న భావన కొందరు వ్యక్తం చేస్తున్నారు. కొత్త నాయకత్వం పుట్టుకొస్తుందని.. ఆలస్యం అయినా…భవిష్యత్తులో మేలు చేస్తుందని నమ్ముతున్నారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇదే తరహా పరిస్థితులు తలెత్తాయి. కానీ వైఎస్‌ రాజశేఖర రెడ్డి, పి.జనార్దన్‌ రెడ్డి వంటి వాళ్లు పార్టీకి కష్టకాలంలో అండగా ఉండి కాపాడుకున్నారు. యువకులుగా ఉన్న, వాళ్లే పార్టీని నడిపించారు. తర్వాత అధికారంలోకి తీసుకొచ్చారు.
Watch video:

ఇప్పుడు తెలంగాణలో అదే రిపీట్‌ అవుతుందన్న నమ్ముతున్నారు. ఎన్టీయార్‌ లాంటి నాయకుడినే తట్టుకుని నిలబడ్డారు. ఇప్పుడు కేసీఆర్‌ పెద్ద కష్టం కాదన్న భావన ఉంది. ఇంకో ఐదేళ్లకు అయినా ప్రజావ్యతిరేకత కలిసివస్తుందని.. దీనిని సమర్ధంగా వాడుకునే నాయకుడు వస్తే పార్టీ మళ్లీ తిరిగి జయకేతనం ఎగరేస్తుందని నమ్ముతున్నారు. అయితే పార్టీని నడిపించే నాయకుడు ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఉత్తమ్‌ ఇప్పటికే విఫల నాయకుడిగా ముద్ర పడ్డారు. డీకే అరుణ వంటి వాళ్లు సైతం ఆయన్ను విమర్శించి పార్టీ వీడారు.. పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు కూడా భట్టి, ఉత్తమ్‌ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఇక పార్టీలో నాయకత్వం అప్పగిస్తే పూర్వవైభవం తీసుకొస్తామని ఇద్దరు నాయకులు తహతహలాడుతున్నారు. ఇందులో కోమటిరెడ్డి బ్రదర్స్‌, అటు రేవంత్ రెడ్డి వీళ్ల భవిష్యత్తుపై ఆశతో ఉన్నారు. తమకు పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత మార్చే అవకాశం ఉంది. మొత్తానికి పోయిన వాళ్లంతా బాధపడే రోజు వస్తుందని చెబుతున్న కాంగ్రెస్‌…పరిస్థితులను అనుకూలంగా మలుచుకుంటుందా? యువరక్తానికి పగ్గాలు అప్పగిస్తుందా? చూడాలి.

Recommended For You