ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి కల్యాణోత్సవం

శ్రీ కోదండరామ స్వామి కల్యాణోత్సవం ఏర్పాట్లను ప్రణాళికాtబద్ధంగా పకడ్బందీగా నిర్వహించి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఇబ్బందులు కలుగకుండా పటిష్టంగా ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి. హరి కిరణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈనెల 18న ఒంటిమిట్టలో శ్రీ కోదండరామ స్వామి కళ్యాణోత్సవం జరుగుతున్న సందర్భంగా మంగళవారం ఉదయం జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, డి ఆర్ వో ఆర్ రఘునాథ్, తితిదే అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో విస్తృతంగా ఏర్పాట్లను పరిశీలించారు. కల్యాణోత్సవం జరిగే ప్రధాన వేదిక నిర్మాణం, వేదిక పైన ఆసీనులైయే ప్రముఖులు, వేదిక ముందు భాగంలో విఐపి, vvip, మీడియా, ఇతర ప్రముఖులు, సామాన్య భక్తులు కూర్చునే గ్యాలరీల ఏర్పాట్లను, ఆధునికంగా ఏర్పాటు చేస్తున్న జర్మన్ షెడ్స్ నిర్మాణాలను పరిశీలించి తగు సూచనలు సలహాలను జారీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ…. గత ఏడాది అకాలంగా వచ్చిన గాలివాన బీభత్సం ని దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తగినట్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా ఉత్సవంలో భక్తులకు వేసవి అయినందున మంచినీటి ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయాలని సూచించారు. కళ్యాణోత్సవానికి వచ్చిన భక్తులందరూ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించే విధంగా గ్యాలరీలలో అక్కడక్కడ భారీ ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేయాలని కూడా సూచించారు. అలాగే ఎన్నికల కమిషన్ అనుమతి మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఇతర మంత్రులు కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నదని, ఆ మేరకు తగిన విధంగా ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే రాష్ట్ర గవర్నర్ కూడా పాల్గొనే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అనంతరం వివిధ అంశాలపై తితిదే అధికారులతో సమీక్షించి తగు సూచనలు, సలహాలు జారీ చేశారు.

అనంతరం వివిధ శాఖల అధికారులతో ఆయన మాట్లాడుతూ…. ఈ కళ్యాణ మహోత్సవానికి దాదాపు రెండు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేయడం జరిగింది అన్నారు. వేసవి కాలం అయినందున వేసవి తాపానికి గురయ్యే అవకాశం ఉందని ఈ మేరకు ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను, అవసరమైన మందులను, రెండు అంబులెన్స్లను సిద్ధంగా ఉంచుకోవాలని dm&ho ను, కళ్యాణ వేదిక వద్ద, ఇతర పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని dpo ను, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్ఇ ని, ఆలయం వద్ద ఇతర ప్రాంతాలలో మంచినీటి ప్యాకెట్లను భక్తులకు అందించేలా ఏర్పాటు చేయాలని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఇని ఆదేశించారు. ముఖ్యమంత్రివర్యులు కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నందున తగిన విధంగా బందోబస్తు ఏర్పాట్లను కూడా పూర్తి చేయాలని, ట్రాఫిక్ సమస్య లేకుండా ప్రణాళికలు రూపొందించుకోవాలని, వాహనాల పార్కింగ్ కూడా తగు విధంగా ప్రణాళికలు రూపొందించుకొని ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారిని కూడా సూచించారు. అంతకు ముందుగా తితిదే జేఈవో లక్ష్మీకాంతం స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించే ప్రాంతంలోని ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించి తగు సూచనలు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కోటేశ్వరరావు డి ఆర్ ఓ రఘునాథ్ ఆర్డిఓ నాగన్న డీఎస్పీ మురళీధర్ టీటీడీ ఏ ఈ ఓ రామరాజు ఎస్ సి 1 రమేష్ రెడ్డి, వి జి ఓ అశోక్ కుమార్ గౌడ్ ఈ హర్షవర్ధన్ రెడ్డి ఎలక్ట్రికల్ ఏఈ చంద్రశేఖర్ డిఎం అండ్ హెచ్ఓ ఉమా సుందరి dpo మోహన్ రావు విద్యుత్ శాఖ ఎస్ఇ శివ ప్రసాద్ రెడ్డి జడ్పీ సీఈవో నగేష్ ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ సంజీవరావు టూరిజం అధికారి రాజశేఖర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు

Recommended For You