ఏపీ మాజీ గవర్నర్ కొడుకునే చంపిన బ్యూటీఫుల్ క్రిమినల్ లేడీ..?

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి, ఏపీ మాజీ గ‌వ‌ర్న‌ర్ ఎన్డీ తివారి కొడుకు రోహిత్ శేఖ‌ర్ ను ఆయ‌న భార్యే హ‌త్య చేసింద‌ని పోలీసులు తేల్చారు. ఇద్ద‌రి మ‌ధ్య కొంత‌కాలంగా గొడ‌వులున్నాయ‌ని పోలీసులు తెలిపారు. ఆస్తి వ్య‌వ‌హారంతో పాటు.. మూడో వ్య‌క్తి ప్ర‌మేయంపైనా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రోహిత్ భార్య అపూర్వ బంధువు అని చెబుతున్న ఓ వ్య‌క్తి విష‌యంలో వీరు త‌ర‌చుగా గొడ‌వ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. అలాగే ఢిల్లీలోని డిఫెన్స్ కాల‌నీలోని ఆస్తి బ‌ద‌లాయింపుపైనా భార్య కొంత‌కాలంగా ఘ‌ర్ష‌ణ ప‌డుతున్న‌ట్టు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఈ నెల 16న‌ ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ జ‌రిగింది. అప్పుడే ఆమె అత‌నిపై దాడి చేసింది. అయితే ఉద్దేశ‌పూర్వ‌కంగా చేయ‌క‌పోయినా.. ఆమె క్షిణికావేశంలో హ‌త్య చేసిన‌ట్టు పోలీసులు నిర్దారించారు. మ‌ద్యం మ‌త్తులో  ఉండ‌డంతో రోహిత్ ప్ర‌తిఘ‌టించ‌లేక‌పోయార‌ని తెలుస్తొంది. అపూర్వ శుక్లా సుప్రీంకోర్టులో న్యాయ‌వాదిగా ప్రాక్టీస్ చేస్తోంది. క్రిమిన‌ల్ మైండ్  ఉప‌యోగించి హ‌త్య‌కు ఆధారాలు లేకుండా చేసింద‌ని తెలుస్తోంది. అందుకే ఆమెను విచారించ‌డానికి మూడురోజులు ప‌ట్టింద‌ని పోలీసులు అంటున్నారు. సీసీ కెమెరాలు ప‌నిచేయ‌డం లేద‌ని న‌మ్మించ‌డంతో పాటు.. అనుమానం రాకుండా.. గుండెపోటుతో చ‌నిపోయిన‌ట్టు న‌మ్మించే ప్ర‌య‌త్నం చేసింది. కానీ దిండుతో అదిమి ఊపిరాడ‌కుండా చేసి చంపిన‌ట్టు పోస్ట్ మార్టమ్ నివేదిక‌తో వాస్త‌వాలు వెలుగుచూశాయి.రోహిత్ కు ఆమె 2017లో ప‌రిచ‌యం అయింది. ఏడాది పాటు డేటింగ్ త‌ర్వాత‌ పెళ్లి చేసుకున్నారు. ఏడాది కూడా తిర‌గ‌క‌ముందే భార్య చేతిలో హ‌త్య‌కు గుర‌య్యాడు రోహిత్‌. దాదాపు ఆరేడేళ్లు తాను ఎన్డీ తివారీ కొడుక‌ని న్యాయ‌పోరాటం చేసి సాధించిన ఆయ‌న వార‌స‌త్వం అనుభ‌వించ‌క‌ముందే ప్రాణాలు కోల్పోయాడు.

Recommended For You