ఎంట్రెన్స్ పరీక్షలు ఎవరికి లాభం?

గాడి తప్పుతున్న ప్రవేశ పరీక్షల విధానం

అనుకూలంగా మలుచుకుంటున్న కార్పొరేట్ కాలేజీలు

ప్రభుత్వం నిర్వ‌హించే ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ పై రోజు రోజుకి ఆసక్తి తగ్గుతోందా ? టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ పూర్తికాగానే ప్రతి విద్యార్ధి ఆర్ జే సి, పాలిటెక్నిక్ వంటి ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర్ అయ్యేవారు. రకరకాల బ్రిడ్జి కోర్సు లపై కూడా ఆసక్తి కనబరచడం మాములే. కానీ దశాబ్ద కాలంగా మార్పు వ‌చ్చింది. ఎంట్రెన్సు ఎగ్జామ్స్ ను రాస్తున్నారు. కానీ తామ ప్రతిభా పాటవాలని కొలిచే కొలమానలుగానే ట్రై చేస్తున్నారు. అంతే కానీ నిజంగా గవర్నమెంట్ కాలేజీల్లో చేరటానికి కాదు. దీనికి కారణం లేకపోలేదు. ప్రభుత్వ కళాశాలల్లో నానాటికీ మృగ్యమవుతున్న విలువలు మరియు కొర‌వ‌డుతున్న‌ నాణ్యతా ప్రమాణాలే ప్ర‌ధాన కార‌ణం. ఒకవేళ  ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించినా.. కార్పొరేట్ కాలేజీలు మార్కెటింగ్ లో భాగంగా వారిని ఎగరేసుకపోయి  విద్యార్ధుల ప్రతిభను తమ ఘనతగా చాటుకుంటున్నాయి. పైగా కార్పొరేట్ కాలేజీల మార్కెటింగ్ స్ట్రాటజీలు కూడా ప్ర‌భుత్వ క‌ళాశాల‌ల ఉనికి ప్ర‌శ్నార్ధకం చేస్తున్నాయి. కార్పొరేట్ సంస్థ‌ల ఇంటింటి ప్రచారాలు,  త‌మ కాలేజీల్లో ఉన్న  సదుపాయాల గురించి ఊదరగొట్టే ప్ర‌క‌ట‌న‌లు మ‌ధ్య‌త‌ర‌గ‌తిని ఆక‌ట్టుకుంటున్నాయి. త‌ల్లిదండ్రులు మోస‌పోతూనే ఉన్నారు.
అటు కళాశాలల్లో ప్రభుత్వ ఉద్యోగులకి ఎటువంటి టార్గెట్లు లేకపోవడంతో వారు వచ్చిన విద్యార్దులతోనే కాలక్షేపం చేస్తున్నారు. చదువు చెప్పడం జీతం అందుకొని జీవితం ఎంజాయ్ చేయడమే తప్ప శ్రద్ధ చూపడం లేదు. ఎలాగూ పార్ట్ టైం ప్ర‌యివేటు కాలేజీల్లో ఉద్యోగాలుంటాయి. ఇక మధ్యతరగతి విద్యార్ధుల మాటేమిటి, ఇలాగే కొన‌సాగితే ప‌రిస్థితి ఏంటి? జాగ్రత్త పడకపోతే ముందు తరాల భవిషత్తు ఏమిటి? వారికి ప్రభుత్వ విద్య అందని ద్రాక్షేనా ? ఒకప్పుడు గవెర్నమెంట్ కాలేజీలో సీటు తెచ్చుకోవడమంటే ఒక యుద్ధం .వచ్చిందంటే సంబరం. 80శాతం మార్కులు వ‌చ్చిన ఇంట‌ర్ కాలేజీలో సీటు దొర‌క‌దు. చివ‌ర‌కు ఆర్ట్స్ గ్రూపుతో స‌రిపెట్టుకున్న 90వ ద‌శ‌కం విద్యార్ధులు ల‌క్ష‌ల్లో ఉన్నారు. కానీ ఈ రోజు కనీస జీవితం గడపలేని సామాన్య ప్రజలు కూడా ప్రైవేటు విద్య కే మొగ్గు చూపుతున్నారు అనేది అక్షర సత్యం. ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి ఏమంటే మార్కెట్లోని ఏ వస్తువైనా పనితీరు కు గారెంటీ వారెంటీ అని సవాలక్ష విధానాలున్నాయి. ఒకవేళ అది ఫెయిల్ అయినా మన జీవితాల్లో కోల్పోయేది కేవలం డబ్బు మాత్రమే కాని విద్య అలా కాదు కదా ఒక సంవత్సరం. ఒక విద్యార్ధి తలరాతను నిర్దేశించేదే కాదు వినాశనకారి కావచ్చు కూడా ఇది గుర్తించుకోవాలి. అయితే ఈ మధ్య తెలంగాణా ప్రభుత్వం తీసుకోబోతున్నామని చెప్పే విషయాలు కాస్త ఊరట కల్గించి ముందుతరాల జీవితాల్లో ఉషస్సును నింపుతాయేమో కాలమే సమాధానం చెప్పాలి.

Recommended For You

Comments are closed.