అసెంబ్లీ అప్ డేట్

అవిశ్వాసం టార్గెట్ టీడీపీ కాదా?

జగన్మోహన్ రెడ్డి

ఏపీ అసెంబ్లీ హాట్‌హాట్‌గా సాగుతోంది. మాట‌ల‌యుద్ధం తారాస్థాయికి చేరింది. జ‌గ‌న్‌, చంద్ర‌బాబు ఓ స‌మ‌యంలో స‌హ‌నం కోల్పోయారు. స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్ల‌తో మార్మోగింది. అసెంబ్లీ యుద్ధ ‘భూమి‘ని త‌ల‌పించింది. భూములు చుట్టూ ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు సాగాయి. ఇక మ‌రో మ‌రోఘ‌ట్టానికి కూడా తెర‌లేవ‌న‌నుంది. జ‌గ‌న్ అవిశ్వాసం అస్త్రాన్ని ప్ర‌యోగించారు. గురువారం ప్ర‌భుత్వం బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతుంది. బ‌డ్జెట్ ప‌ద్దుల‌పై చ‌ర్చ అనంత‌రం అవిశ్వాసంపై స్పీక‌ర్ చ‌ర్చ‌కు అనుమ‌తి ఇచ్చే అవ‌కాశం ఉంది. ఇందులో కూడా మ‌రింత హాట్‌గా అసెంబ్లీ జ‌రిగే అవ‌కాశం ఉంది..

అవిశ్వాసం నోటీసులు ఇవ్వ‌డం వెన‌క జ‌గ‌న్ ల‌క్ష్యం వేరు.  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌ను టార్గెట్ చేసి ఈ నోటీసులు ఇచ్చారు. చ‌ర్చ‌లో పాల్గొనాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెస్ విప్ జారీ చేస్తుంది. దీంతో ఫ్యాను గుర్తుపై గెలిచిన అభ్య‌ర్ధులంతా అదే పార్టీకి మ‌ద్ద‌తుగా ఓటు వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ప్ర‌భుత్వానికి మద్ద‌తుగా నిలిస్తే వారిపై అన‌ర్హ‌తా ఫిర్యాదు స్పీక‌ర్‌కు ఇస్తారు. విప్ ధిక్క‌రించ‌డం కంటే పెద్ద ఆధారం అవ‌స‌రం లేదు కాబ‌ట్టి.. ఫ‌రాయింపుదారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని వైసీపీ డిమాండ్ చేస్తుంది. అలా జంప్ జిలానీలు ల‌క్ష్యంగా వైసీపీ అవిశ్వాసం నోటీసులు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది.

అయితే పార్టీ ఫిరాయించిన నేత‌లు మాత్రం అధికార పార్టీపై న‌మ్మ‌కంతో ధీమాగా ఉన్నారు. కొంద‌రు సాకులు చూపించి చ‌ర్చ‌కు డుమ్మా కొట్టే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ అంత‌కీ విప్ ధిక్కరించినా… అధికార పార్టీ ఏదో ర‌కంగా గండం నుంచి గ‌ట్టెక్కిస్తుంద‌ని చెబుతున్నారు. చూడాలి… జంప్ జిలానీలు ఎలా బ‌య‌ట‌ప‌డతారో?

Recommended For You

Comments are closed.