ద్విశతక ధీరుడుగా నిలిచాడు

భారత ఆఫ్‌ స్పిన్నర్ త‌మిళ తంబి రవిచంద్రన్‌ అశ్విన్‌ అరుదైన ఘనత సాధించాడు. డెన్నిస్ లిల్లీ, వ‌కార్ యూనిస్‌ల రికార్డుల‌ను బ్రేక్ చేశారు. అయితే ఆస్ల్రేలియా లెగ్‌స్నిన్న‌ర్ క్లారీ గ్రిమ్మెట్ రికార్డు మాత్రం అందుకోలేక‌పోయాడు. కివీస్‌తో జ‌రిగిన కాన్పూర్ టెస్టులో అశ్విన్ 200 వ వికెట్‌ను అందుకున్నాడు. 500 వ టెస్టు మ్యాచ్‌లో ప్ర‌త్య‌ర్ధి కివీస్ కెప్ట‌న్ విలియ‌మ్స‌న్‌ను అవుట్ చేయ‌డం ద్వారా త‌న ఖాతాలో 200వ వికెట్ వేసుకున్నాడు. కేవ‌లం 37 టెస్టుల్లోనే అశ్విన్ ఈఘ‌న‌త సాధించాడు. లిల్లీ, వ‌కార్‌లు ఈ ఫీట్ సాధించడానికి 38 టెస్టులు ప‌ట్టాయి. అయితే 36 టెస్టుల్లోనే 200 వికెట్లు తీసిన క్లారీ రికార్డు అలాగే ఉంది. మొత్తానికి చారిత్రాత్మ‌క టెస్టు మ్యాచ్‌లో త‌న మెరుగైన బౌలింగ్‌తో భార‌త్‌ను ప‌టిష్ట స్థితికి చేర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీశాడు.

Recommended For You

Comments are closed.