అర‌వ‌రాజ్యంలో తెలుగు తుఫాన్‌!

ట్రెండీ పాలిటిక్స్!

వైకో తో విజయ్ కాంత్

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఇప్పుడు తెలుగు తుఫాను అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తోంది. ప్ర‌ధాన పార్టీల‌కు గుబులు పుట్టిస్తోంది. ఆ తుఫాను పేరే విజ‌య్‌కాంత్‌.. వైగో. రాజ‌కీయాల్లో త‌న‌దైన నిర్ణ‌యాల‌తో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న కెప్ట‌న్ విజ‌య్‌కాంత్ తెలుగువాడే. త‌మిళంలో స్థిర‌ప‌డ్డ తెలుగు కుటుంబానికి చెందిన‌వాడు. పైగా ఏపీలో బ‌ల‌మైన సామాజిక వ‌ర్గానికి చెందిన‌వాడు. త‌మిళ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు ఆయ‌న పేరు చెబితేనే ప్ర‌ధాన పార్టీలు వ‌ణుకుతున్నాయి. ఆయ‌న‌కు తోడు మ‌రో నాయ‌కుడు కూడా జ‌త‌య్యారు. ఆయ‌నే వైగో.. య‌ల‌మంచిలి గోపాల‌కృష్ణ‌.. ఆయ‌న కూడా తెలుగువాడే. త‌మిళంలో స్థిర‌ప‌డిన తెలుగు కుటంబానికి చెందినవాడు. ఇప్పుడు వీరిద్ద‌రూ క‌లిసి త‌మిళ రాజ‌కీయాలను మ‌లుపు తిప్పుతున్నారు.
 గ‌తంలో కెప్ట‌న్ పెద్ద పార్టీల‌తో పొత్తులు పెట్టుకుని న‌ష్ట‌పోయారు. జ‌య‌ల‌లిత‌తో విబేధాలు వ‌చ్చాయి. కేసులు ఎదుర్కొన్నారు. పార్టీలో బీట‌లు వారాయి. ఇక పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీతో జ‌త‌క‌ట్టి దారుణంగా దెబ్బ‌తిన్నారు. ఒక్క‌సీటు గెల‌చుకోలేదు. ప్రాంతీయ అభిమానం ఎక్కువ‌పాళ్లు ఉన్నరాష్ట్రంలో బీజేపీతో పొత్త్తు పెట్టుకుని ఇబ్బందులు ప‌డ్డామ‌ని కెప్ట‌న్‌కు అర్ధ‌మైంది. అంద‌కే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ద‌గ్గ‌ర‌కు కూడా రానీయ‌లేదు. సిఎం అభ్యర్ధిగా ప్రకటిస్తామన్నా ప‌ట్టించుకోలేదు. డిఎంకే క‌రుణానిధి క‌లిసి పోటీచేద్దామ‌ని వెంట‌ప‌డినా వ‌ద్ద‌ని ముఖంమీద‌నే చెప్పేశారు. సొంతంగానే బ‌లం చూపించాల‌ని విజ‌య్‌కాంత్ భావిస్తున్నారు. మిత్రుడు సాటి తెలుగువాడు అయిన వైగోకు మాత్రం స్నేహ‌హ‌స్తం అందించాడు. దీంతో త‌మిళ‌నాడు రాజ‌కీయాలు మొత్తం ఈ ఇద్ద‌రు తెలుగువాళ్ల చుట్టూ తిరుగుతున్నాయి. డిఎంకే ప‌ట్ల ప్ర‌జ‌ల్లో విశ్వాసం స‌న్న‌గిల్లింది. జ‌య‌ల‌లిత‌ ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ప‌నిచేసి కెప్ట‌న్‌కు క‌లిసి వ‌స్తుందా? మ‌రి తెలుగు-త‌మిళ‌ నేత‌లు త‌మిళ‌నాట కింగ్‌లుగా మార‌తారా?
త‌మిళ‌నాడులో ప‌రాయిరాష్ట్రం వాళ్లు పాల‌న సాగించ‌డం కొత్త కాదు.. గ‌తంలో ఎంజీఆర్ కేర‌ళ‌వాసి. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత క‌ర్నాటక‌లో పుట్టారు. ఇప్పుడు విజ‌య్‌కాంత్ అంతే అంటున్నారు. త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల‌కు న‌చ్చితే వారి పుట్టిన ప్రాంతం అవ‌స‌రం లేదు. క‌డుపులో పెట్టుకుని చూస్తారు. ఇందుకు ర‌జ‌నీకాంత్ కూడా ఓ ఉదాహ‌ర‌ణ‌.

Recommended For You

Comments are closed.